నార్మల్ డెలివరీ తరువాత తల్లి కోలుకోవడానికి జాగ్రత్తలు

తల్లికి ఏం కష్టాలుంటాయి అంటే ఎవరైనా సరే, నవమాసాలు ఆమె మోసే బరువు గురించి మాట్లాడుతారు, ఆ తొమ్మిది నెలల జాగ్రత్తల గురించి, డెలివరీ సమయంలో ఆమె పడె అవస్థ, నొప్పుల గురించి మాట్లాడుతారు. అంతేనా, తల్లి శారీరకంగా, మానసికంగా ఒత్తిడి అక్కడితోనే అయిపోతుందా ? ఆ తరువాత ఆమెకి అలసట, నొప్పి ఉండదా? డెలివరీ తరువాత ఆమె అవస్థల గురించి ఎవరు మాట్లాడరే? వెజైనల్ బర్త్ (నార్మల్) డెలివరీ అయనా, ఆమె శరీరంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. హార్మోన్స్ బ్యాలెన్స్ వేరే దిశలో ఉంటాయి. శారీరకంగా నొప్పులు ఉంటాయి. కేవలం సిజేరియన్ అయినప్పుడే, ఆ గాయాలుంటేనే ఆమె మానసికంగా, శారీరకంగా బాధలో ఉన్నట్లు అర్థం కాదు. కాబట్టి నార్మల్ డెలివరీ అయినసరే, తల్లి ఈ పది విషయాలు పట్టించుకోవాలి.

1) విశ్రాంతి

విశ్రాంతి, నిద్ర .. రెండూ బాగా తీసుకోవాలి. తొమ్మిది నెలలుగా ఆమె నొప్పులతో, శరీరంలో జరుగుతున్న మార్పులతో ఎన్నో నిద్రలేని రాత్రులని గడిపింది. శారీరకంగా, మానసికంగా అలసిపోయిన తల్లికి అన్నిటికన్నా ముందుగా మంచి నిద్ర, విశ్రాంతి అవసరం. లేదంటే ఆమె మీద ఒత్తిడి ఇంకా పెరిగిపోతుంది. పుట్టిన బిడ్డను చూసుకోవాలి కాబట్టి ఆ తాలూకు స్ట్రెస్ మొదలవుతుంది. ఈ సమయంలో హార్మోన్స్ సమతూల్యం దెబ్బతినకూడదు అంటే విశ్రాంతి అవసరం

2) గోరువెచ్చని నీటితో స్నానం

స్నానం ఎక్కువగా గోరువెచ్చని నీటితోనే చేయాలి. నార్మల్ డెలివరి జరిగినప్పుడు యోని స్ప్రెడ్ అవడం, తిరిగి మామూలు సైజుకి మారడం జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు చాలా నొప్పిగా ఉంటుంది. వుల్వా దగ్గర కూడా గాయాలుంటాయి. కొందరికి స్టిచెస్ కూడా పడతాయి. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. రోజుకి రెండు మూడు సార్లు గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. యోనిని గోరువెచ్చని నోటితోనే శుభ్రం చేసుకోవాలి. మూత్రవిసర్జన చేసినప్పుడల్లా క్లీన్ చేసుకోవడం మంచిది.

3) రక్తం కోసం ప్యాడ్స్ :

డెలివరీ తరువాత 2-6 వారాల వరకు రక్తం బయటకి రావడం చాలామందిలో చూసేది. ఇలాంటి సమయంలో హైజీన్ చాలా ఇంపార్టెంట్. లేదంటే బ్యాక్టీరియా, ఆ తరువాత ఇంఫెక్షన్స్ దాడిచేస్తాయి. ఈ సమయంలో జరిగే బ్లీడింగ్ ని లోచియా అని అంటారు. యూటెరస్ లోకి బ్యాక్టీరియా వెళ్ళకూడదు అంటే మంచి క్వాలిటి ప్యాడ్స్ వాడాలి. టాంప్టన్స్ కి బదులు ఎక్సట్రా మాక్సి ప్యాడ్స్ వాడటం బెటర్. రక్తం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. అండర్ వియర్, ప్యాడ్స్ ఎల్లప్పుడూ డ్రైగా ఉంచుకోవాలి.

4) ఐస్ ప్యాక్స్ .. నొప్పుల కోసం

యోని ప్రాంతం అంతా నొప్పిగా, మంటగా ఉంటుంది. ఈ నొప్ప, మంట నుంచి కాస్తంతైనా ఉపశమనం పొందాలంటే ఐస్ ప్యాక్స్ లేదా ఐస్ క్యూబ్స్ ఉపయోగించడం మేలు. ఎందుకంటే ఐస్ నరాలను మొండిగా ఉంచుతుంది. దాంతో నొప్పి పెద్దగా బయటకి తెలియకుండా ఉంటుంది. నొప్పి, మంట తీవ్రంగా ఉన్నప్పుడు ఇలా చేస్తే మేలు. అయితే డైరెక్ట్ గా పెట్టుకోకుండా, శుభ్రమైన ఫాబ్రిక్ క్లాత్ లో ఐస్ చుట్టి, ఎక్కడైతే ఉబ్బుగా, నొప్పిగా, మంటగా ఉందో, ఆయా ప్రదేశాల్లో దీన్ని ఉంచుతూ ఉండాలి.

5) కెగెల్ వ్యాయామం

Kegel Exercises, కెగెల్ వ్యాయామం పెల్విక్ నరాలకి చాలామంచిది. ముఖ్యంగా వెజైనల్ డెలివరి జరిగి, కోలుకోవాలనుకుంటున్న మహిళలకు ఈ తరగా వ్యాయామాలు ఎనలేని సహాయం చేస్తాయి. వీటి ద్వారా పెల్విక్ నరాలు బలంగా మారి, యోని – రెక్టిమ్ మధ్యలోని గాయలు, నొప్పులు తగ్గుతాయి. అయితే ఈ కెగెల్ వ్యాయామాలు డెలివరీ జరిగిన ఒకటిరెండు వారాల తరువాతే మొదలుపెట్టాలి. ఇక వీటని ఎలా చేయాలంటే, మూత్ర విసర్జన చేసే నరాలను వేళ్ళతో పది సెకన్లపాటు బ్లాక్ చేసి, మరో పది సెకన్ల పాటు వదిలేయాలి. ఇలా పదిపదిహేను సార్లు చేయాలి. ఈ వ్యాయామన్ని రోజుకి మూడుసార్లు చేయాలి.

 

SHARE